రాయికల్

రామాజీపేట లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

viswatelangana.com

April 14th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
  • స్వచ్ఛంద రక్త ధాన శిబిరం
  • క్రీడా పోటీల నిర్వహణ

భారతరత్న డా,బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువసేన యూత్ రామాజీపేట వారి ఆధ్వర్యంలో భారతి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సోషల్ మీడియా వర్కర్ మోహమ్మద్ ముస్తాక్ అహమ్మద్ మాట్లాడుతూ తల్లి జన్మణిస్తే ఒకరికి రక్తదానం పునర్జన్మ నిస్తుందనియువత రక్తదానం చేయడం వలన సకాలం లో ఎంతోమంది ప్రాణాలు కాపడుటకు కృషిచేయచ్చు అని మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భరత్ రాజ్ ఉపాధ్యక్షులు సుధాకర్ ప్రోగ్రాం ఆర్గనైజింగ్ బెక్కం మనోజ్ అంబేద్కర్ సంఘాల సభ్యులు స్వచ్ఛంద రక్త దానం చేసిన యువత సాయి నరేష్ రాజశేఖర్ సంజీవ్ సుదర్శన్ భరత్ రాజు నరేందర్ గంగాధర్ రణధీర్ నరేష్ దీపక్ అరవింద్ మాజీ ఉప సర్పంచ్ హరీష్ రావు రమాపతి రావు నర్సయ్య కోల రాజు గ్రామ ప్రజలు యువత ను అభినందించారు యువత క్రీడా సామాజిక సాంస్కృతిక కార్యకలాపాలలో ముందు ఉండాలని క్రీడల ద్వారానే స్నేహ భావం కలుగుతుందని గ్రామ యువత క్రీడా రంగాల్లో ముందుకెళ్ళడానికి తనవంతు అన్ని రకాల కృషి చేస్తానని దుగ్యాల లక్ష్మీపతి అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు

Related Articles

Back to top button