కోరుట్ల
ఆలయ హుండీ లెక్కింపు
viswatelangana.com
March 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ హుండిని మంగళవారం లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయ జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన మండపంలో కూర్చుని హుండీ లెక్కించగా 60వేల 928 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ కార్యక్రమంలో ఈవో ఎం.విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ పేడి వెళ్లి నరసయ్య ఆలయ ప్రధాన అర్చకులు బి.నరసింహ చారి, భక్తులు రేగుల భూమానందం, శ్రీనివాస్, రమేష్ గుప్తా, ప్రసాద్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు..



