కోరుట్ల
విశ్వశాంతి లో రెడ్ డే
viswatelangana.com
January 3rd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లోని గడి బురుజు వద్ద గల విశ్వశాంతి హై స్కూల్లో రెడ్ డే వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. విద్యార్థులు ఎరుపు రంగు దుస్తులు ధరించి రంగుల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బ్రహ్మన్న గారి శంకర్ శర్మ మరియు ప్రిన్సిపాల్ చీటీ సత్యం రావులు మాట్లాడుతూ విద్యార్థులలో రంగుల పట్ల అవగాహన కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



